![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -281 లో.. అందరూ కోనేటి దగ్గర దీపాలు వదలడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు మాట్లాడుకుంటుంటే చూడలేని అనామిక తల్లి, ఈర్ష్యతో వాళ్ళు మాట్లాడుకుంటున్నది అనామికని పిలిచి చూపిస్తుంది. దాంతో అనామిక కోపంగా కళ్యాణ్ ని పిలుస్తుంది. అప్పు ఫీల్ అవుతుంది.
మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేసి పక్కకిరా మాట్లాడాలని చెప్తుంది. దాంతో రాజ్ మళ్ళీ వస్తానంటూ ఎవరు చూడకుండా అక్కడ నుండి వెళ్లి శ్వేతని కలుస్తాడు. అదే సమయంలో దీపాలు పెట్టడానికి అగ్గిపెట్టె లేదు, తీసుకోని వస్తానంటూ అపర్ణ అక్కడ నుండి వెళ్తుంది. రాజ్ ని శ్వేత హగ్ చేసుకొని ఉండడం చూసిన అపర్ణ షాక్ అవుతుంది. అలా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏం జరిగినా నీకు నేను ఉన్నానని శ్వేతకి రాజ్ చెప్తాడు. అప్పుడే ప్రకాష్ ఫోన్ చెయ్యడంతో శ్వేతను రాజ్ పంపించేసి.. కోనేరు దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఆడవాళ్లు అందరు కోనేటి లో దీపాలు వదులుతారు. కనకం అనామిక వదిలిన దీపం మునిగిపోయేలా చేస్తుంది. అది మునగకుండా కావ్య ట్రై చేస్తుంది కానీ అనామిక తల్లి కావ్యని తప్పు గా అర్థం చేసుకొని.. నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు కావాలనే ఇదంతా చేస్తున్నావ్ కదా? అనామికని తప్పించి నీ చెల్లిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నావ్ కదా అని అంటుంది. నేను అలా ఎప్పుడు చెయ్యనని కావ్య అంటుంది. అప్పు నాకు మంచి ఫ్రెండ్ అని కళ్యాణ్ అనామిక వాళ్ళ అమ్మపై కోప్పడతాడు.
ఆ తర్వాత నాకంటే ఎక్కవ నువ్వు అప్పుతో ఉంటున్నావని అనామిక అనగానే.. నా వల్ల మీరు ఎందుకు గొడవ పడతారు. నేను ఇక ఎప్పుడు కళ్యాణ్ ని కలవనని అప్పు వెళ్లిపోతుంటే.. అప్పుని కళ్యాణ్ ఆపి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంది నిజం అవుతుందని అంటాడు. అ తర్వాత ఇందిరాదేవి మధ్యలో కలుగజేసుకొని మీరు చదువుకున్న వాళ్ళు అలా ఎలా అర్ధం చేసుకుంటారని అనగానే.. కావ్య గారు ఏం తప్పు చెయ్యలేదని అనామిక చెప్తుంది. మరుసటి రోజు ఉదయం శ్వేతతో రాజ్ రహస్యంగా ఫోన్ మాట్లాడుతుంటే అపర్ణ వింటుంది. తర్వాత రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా అని అనుకుంటుంది.
తరువాయి భాగంలో.. కావ్య నీపై ప్రేమ పెంచుకుంటుందని రాజ్ తో అపర్ణ అనగానే.. నాకు మాత్రం తనపై ప్రేమ పుట్టదు అంటాడు. ఎప్పటి వరకు ఇలా అని అపర్ణ అడుగుతుంది. తాతయ్య బాగయ్యే వరకు, ఆ తరువాత నా జీవితంలో కావ్య ఉండదని రాజ్ చెప్తాడు. వెళ్ళనని చెప్తే ఏం చేస్తావని అపర్ణ అనగానే.. వెళ్లిపోయేలా చేస్తానని రాజ్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |